logo

అక్రమ రవాణాకు చెక్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు.

Published : 08 May 2024 03:41 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, విలువైన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమ రవాణా, ప్రలోభాలు అడ్డుకోవడం కోసం ఎఫ్‌ఎస్టీ(ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు), ఎస్‌ఎస్టీ(స్టాటిస్టిక్‌ సర్వేలైన్‌ బృందాలు) విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. వీరు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఇతర వస్తువులను గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగిస్తున్నారు. బాధిత వ్యక్తులు ఈ గ్రీవెన్స్‌ కమిటీకి సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే కమిటీ సభ్యులు పరిశీలించి తిరిగి అప్పగిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో..

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా రూ.3,43,13,420 నగదును పట్టుకొని గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించారు. ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నవారికి తిరిగి రూ.3,42,02,420లను వెంటనే అప్పగించారు. మిగతా రూ.1,11,000లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెరిచిన బ్యాంకు ఖాతాలో గ్రీవెన్స్‌ కమిటీ సభ్యులు జమ చేశారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం, ఇతర మాదక ద్రవ్యాల విలువ రూ.50,16,250 ఉంటుంది. వీటిని సంబంధిత అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1,29,11,426 ఉండగా తిరిగి దరఖాస్తు చేసుకున్న బాధితులకు అప్పగించారు. ఇతర వస్తువుల విలువ రూ.1,11,47,956 ఉండగా వీటిని అభ్యర్థన మేరకు మొత్తం అందజేశారు.]

కట్టుదిట్టంగా తనిఖీలు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, ఎక్కడికక్కడ జరిపిన తనిఖీల్లో ఆధారాలు లేని సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం వరకు స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువుల విలువ రూ.6.66 కోట్లు ఉండగా వీటిని గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించారు. ఇందులో గ్రీవెన్స్‌ కమిటీకి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రూ.5.79 కోట్లను తిరిగి సంబంధిత వ్యక్తులకు ఇచ్చేశారు. మిగతా వాటి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.


పక్కాగా కోడ్‌ అమలు

-వెంకటరావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, సూర్యాపేట

జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు, డిజిటల్‌ లావాదేవీలపై నిఘా పెడుతున్నాం. స్వాధీనం చేసుకున్న సొత్తుకు రసీదులు, ఆధారాలతో గ్రీవెన్స్‌ కమిటీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే 24 గంటల్లోపు తిరిగి ఇచ్చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు