logo

సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ

జిల్లాలో పోలీసులు, సెబ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు.

Published : 19 Apr 2024 04:06 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో పోలీసులు, సెబ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం పోలీసు, సెబ్‌ అధికారులతో  సమన్వయ సమావేశం నిర్వహించారు. తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. చెక్‌పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఎన్‌డీపీఎల్‌ మద్యం జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం స్టాక్‌ పాయింట్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తరచూ తనిఖీ చేసి అవకతవకలను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య, ఈఎస్‌ కె.బాబు శ్రీధర్‌, సెబ్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని