logo

సోమశిలలో అడుగంటిన జలం

జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు..

Published : 26 Apr 2024 05:17 IST

అనంతసాగరం, న్యూస్‌టుడే: జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. జలాశయంలో నీటి లీకేజీలతో ఉన్న కొద్దిపాటి నీరు వృథా అవుతున్న పరిస్థితి.. జిల్లావాసులకు తాగునీటి కష్టాలు తీసుకొచ్చాయి. జలాశయంలో ప్రస్తుతం 8.3 టీఎంసీల నీరు ఉండగా- ఆలస్యంగా సాగు చేసిన పంటలకు ఈ నెలాఖరు వరకు నీటిని పంపిణీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అదే జరిగితే.. నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీ 7.5 టీఎంసీల కంటే మరింత దిగజారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంకటస్థితి ఇలాగే కొనసాగితే.. మే నెలలో తాగునీటి ఇబ్బందులు తప్పవేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని