logo

వైకాపా బరితెగింపు

అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొని గెలిచేందుకు అడ్డదారులు ఎంచుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్దే ఈ భాగోతం నడవడం విశేషం.

Published : 08 May 2024 06:38 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు డబ్బుల కవర్లు

ఓటు వేయడానికి నిరీక్షిస్తున్న ఉద్యోగులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొని గెలిచేందుకు అడ్డదారులు ఎంచుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్దే ఈ భాగోతం నడవడం విశేషం. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బలవంతంగా కవర్‌లో డబ్బు పెట్టి ఇచ్చారు. రూ.5వేలు వరకు కవర్‌లో పెట్టి ఇవ్వడం విశేషం. కొందరికి నేరుగా నోట్లనే ఇచ్చారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్దే డబ్బులు పంపిణీ చేసినా అధికారులు పట్టించుకోలేదు.

అధికారులు విఫలం

జిల్లాలో ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 20,531 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉండగా.. 19,245 మంది, ఇతర జిల్లాల ఓటర్లు 2,548 మంది ఉండగా.. 2,054 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.

అదే గందరగోళం

జిల్లాలో  మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌ అంతా గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేక వెనుదిరగాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇతర జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడి ఎన్నికల విధుల్లో ఉన్న వారిలో కొందరు పీవోలు, ఏపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ రాకపోవడంతో మళ్లీ ఫారం-12 సమర్పించాల్సి వచ్చింది. ఈ విషయంలో ముందు నుంచి అవగాహన, పూర్తి సమాచారం అందించకపోవడంతో చాలా మంది వెనుతిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు