logo

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

టీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం  జరిగింది.

Published : 26 May 2024 10:49 IST

కామారెడ్డి పట్టణం: టీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా పాలేటి వెంకట్రావు (అఖిల భారత పాఠశాల ప్రభారీ), జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్గం రాఘవరెడ్డి, భునేకర్‌ సంతోష్‌లు  మాట్లాడారు.  ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, జీవో 317  ప్రకారం బాధితులకు న్యాయం చేసి వాళ్లను సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ, ఏరియర్స్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టైమ్‌ స్కేలు వర్తింపచేసి వేతనాలు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రబాధ్యులు రవీంద్రనాథ్‌ ఆర్య, మ్యాక రామచంద్ర, జిల్లా బాధ్యులు లక్ష్మీపతి, ఆంజనేయులు, శోభన్‌బాబు, సత్యనారాయణ, దత్తాచారి, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని