logo

జిల్లాలో పెరిగిన ఓటర్లు

జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 27 Apr 2024 03:20 IST

అనుబంధ జాబితా విడుదల

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత కూడా అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటుకు నమోదు చేసుకోవాలంటూ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. అధికారులు విడుదల చేసిన అనుబంధ జాబితాలో కామారెడ్డి జిల్లా పరిధిలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లా ఓటర్ల సంఖ్య 8,77,747కు చేరింది.

మహిళలే అధికం..

కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎన్నికల అధికారులు ప్రత్యేక అనుబంధ ఓటరు జాబితా విడుదల చేశారు. నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం నాలుగువేలకు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచే అత్యధికంగా నమోదు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా నమోదు చేసుకోవడం విశేషం. దరఖాస్తు చేసుకున్న వారి చిరునామా ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశాక అనుబంధ ఓటరు జాబితా విడుదల చేశారు. ఇదే జాబితా అనుసరించి ఎన్నికలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని