logo

‘భాజపా అభ్యర్థికి తెదేపా మద్దతు’

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భాజపా అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పైడి గోపాల్‌రెడ్డి ప్రకటించారు.

Published : 08 May 2024 06:35 IST

ఈనాడు, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భాజపా అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పైడి గోపాల్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ బాధ్యులు, ముఖ్యనేతలు భాజపా నేతలతో కలిసి ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. తెదేపా మద్దతుదారులు, అభిమానులు భాజపా గెలుపు కోసం కృషి చేయాలని వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా, తెదేపా కార్యకర్తల సమన్వయ సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు