logo

ఇంటర్‌లో అధికంగా విద్యార్థుల అనుత్తీర్ణత

ఇటీవల విడుదలైన పది, ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది కన్నా తక్కువ ఉత్తీర్ణతశాతం నమోదైంది. వచ్చే నెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

Published : 08 May 2024 06:49 IST

కామారెడ్డి విద్యావిభాగం-న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన పది, ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది కన్నా తక్కువ ఉత్తీర్ణతశాతం నమోదైంది. వచ్చే నెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే విద్యార్థులకు వెనుకబడిన విషయాల్లో శిక్షణ ఇస్తే ఈ సారైనా సత్ఫలితాలు ఆశించే వీలుంటుంది. ఊహించని విధంగా ఇంటర్‌లో 35వ, పదో తరగతిలో 19వ స్థానానికి జిల్లా రాష్ట్రస్థాయిలో పడిపోవడం చర్చనీయాంశమైంది. కాగా నెల రోజుల పాటు విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

 ప్రణాళిక ప్రకారం తరగతులు

 వేసవిలో ఎండలు మండుతున్నాయి. అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యం తరగతుల నిర్వహణ చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం తరగతులు జరిపేలా కార్యాచరణను ప్రధానోపాధ్యాయులు రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే సమీక్షా సమావేశాలు

అనుత్తీర్ణులైన విద్యార్థులు ఎందుకు ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడ్డారో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కారణాలు తెలుసుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ మార్కులు సాధించేలా శిక్షణ ఇవ్వాలి. వార్షిక ఫలితాల్లో తక్కువగా నమోదైన ఫలితాలపై ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. ఫలితాలు ఎందుకు తగ్గాయో బేరీజు వేస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేలా అధ్యాపకులు దృష్టి పెట్టాలని డీఐఈవో సలాం ఆదేశించారు. కాగా పాఠశాల విద్యాశాఖ తరఫున ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదు. ఈ సారి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తామని డీఐఈవో ‘న్యూస్‌టుడే’తో అన్నారు. పదిలో అనుత్తీర్ణులైనవారి కోసం ప్రత్యేక తరగతులు చేపడతామని డీఈవో రాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు