logo

బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతి

ఇందూర్ నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీర శైల లింగాయత్ సంఘం దుబ్బ వారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని నిర్వహించారు.

Updated : 10 May 2024 12:40 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: ఇందూర్ నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీర శైల లింగాయత్ సంఘం దుబ్బ వారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందు వాహిని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సాంగ్ నగర కార్యవాహ అరుగుల సత్యం జి వచ్చేసి బసవేశ్వరమహారాజ్ వీరశైల లింగాయత్ సమాజానికి, కులాలకు అతీతంగా చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు సంగం అప్ప, చంద్రకాంతప్ప, నందప్ప, ప్రభాకరప్ప, గజానంద్ అప్ప, బాబు అప్ప, హిందూ వాహిని ప్రాంత అధికారి లీలాసురేష్, జిల్లా అధ్యక్షుడు అనిల్ కదం, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి దాత్రిక రమేష్, హిందు వాహిని నగర అధ్యక్షుడు సనాతన శ్రీకాంత్, బినయ్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు