logo

భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు

బాలీవుడ్‌ స్టార్‌ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.

Published : 08 May 2024 01:24 IST

నేడు రాయగడ, భవానీపాట్నాకు రాజ్‌నాథ్‌

రేపు నితీన్‌ గడ్కరీ, బిష్ణుదేవ్‌ సాయె

 

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బాలీవుడ్‌ స్టార్‌ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 13న తొలివిడతగా పోలింగ్‌ జరగనున్న బ్రహ్మపుర లోక్‌సభ పరిధిలో ఆమె పర్యటిస్తారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్‌మహాపాత్ర్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాయగడ, భవానీపాట్నాల్లో ఏర్పాటయ్యే విజయ సంకల్ప సమావేశాల్లో ప్రసంగిస్తారన్నారు. 8న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ నవరంగపూర్‌, ఉమర్‌కోట్‌లలో ప్రచారం చేస్తారన్నారు. 9న ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పూరీ, కృష్ణప్రసాద్‌ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. గురువారం అసోం సీఎం హేమంత విశ్వశర్మ మల్కాన్‌గిరి, చిత్రకొండ, కళ్లికోటల్లో ప్రచారం చేస్తారన్నారు.

 రాజధానివాసులకు ఆహ్వానం: భువనేశ్వర్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి అపరాజిత షడంగి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ రెండురోజుల రాష్ట్ర పర్యటనకు 10వ తేదీ సాయంత్రం వస్తున్నారని చెప్పారు.శుక్రవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు భువనేశ్వర్‌ మాస్టర్‌ కేంటీన్‌ నుంచి వాణివిహార్‌ (ఉత్కళ విశ్వవిద్యాలయం) వరకు ప్రధాని రోడ్‌షో నిర్వహిస్తారని, రాజధాని వాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 11న మోదీ బొలంగీర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు