logo

నామపత్రాల పరిశీలన పూర్తి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం పరిశీలించారు.

Published : 27 Apr 2024 05:29 IST

అరకు లోక్‌సభ స్థానంలో 11 తిరస్కరణ

సాలూరు నియోజకవర్గంలో పత్రాలు పరిశీలిస్తున్న ఆర్వో విష్ణుచరణ్‌

పార్వతీపురం, సాలూరు, సీతంపేట, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఎంపీ స్థానానికి 38 సెట్లు దాఖలవగా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించి పదకొండింటిని తిరస్కరించారు. ఉప సంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉందన్నారు.

పార్వతీపురం నియోజకవర్గంలో..

పార్వతీపురంలో 18 సెట్లను ఆర్వో హేమలత పరిశీలించి నాలుగు తిరస్కరించారు. వీరిలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ అభ్యర్థులకు డమ్మీలుగా ఉన్న కత్తుల అనూష, అలజంగి రవికుమార్‌, బత్తిన జ్ఞానానందం ఉన్నారు. తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర మూడు సెట్లు దాఖలు చేయగా ఒకటి తిరస్కరణకు గురైంది. మిగిలిన 14 సరిగా ఉన్నాయని ఆర్వో ప్రకటించారు.

సాలూరు నియోజకవర్గంలో..

ఇక్కడ పది మంది 15 సెట్లు వేశారు. తెదేపా, వైకాపా అభ్యర్థులకు డమ్మీలుగా పత్రాలు సమర్పించిన గుమ్మిడి పృథ్వీ, పీడిక సుదర్శనరావు సెట్లను ఆర్వో విష్ణుచరణ్‌ తిరస్కరించారు. మిగిలిన ఎనిమిది మంది వేసిన 13 నామినేషన్లను ఆమోదించారు. గుమ్మిడి సంధ్యారాణి(తెదేపా), పీడిక రాజన్నదొర(వైకాపా), మువ్వల పుష్పారావు(కాంగ్రెస్‌) తదితరులు పోటీలో నిలిచారు.

పది ఆమోదం..        

పాలకొండ నియోజకవర్గ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైకాపా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు డమ్మీలుగా వేసిన నామినేషన్లు శుక్రవారం తిరస్కరించారు. మిగిలిన పది ఆమోదించారు. వైకాపా, జనసేన అభ్యర్థులు కళావతి, జయకృష్ణ రెండేసి సెట్లు వేశారు.

కురుపాంలో..

ఈ నియోజకవర్గంలో 19 సెట్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు డమ్మీలుగా ఉన్న బిడ్డిక శంకరరావు (సీపీఎం), అడ్డాకుల నరేష్‌ (తెదేపా), మండంగి సంతోషి (వైకాపా) పత్రాలను ఆర్వో వి.వి.రమణ తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని