logo

వైకాపా నుంచి భారీగా వలసలు

మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు.  సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు.

Published : 30 Apr 2024 04:39 IST

పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న సంధ్యారాణి

మక్కువ, న్యూస్‌టుడే: మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు.  సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. కొయ్యానపేట మాజీ సర్పంచి కాశీవిశ్వనాథం, ఆర్ని కృష్ణమూర్తి పార్టీలో చేరారు.  మావుడి ప్రసాదనాయుడు, గౌరీశంకర్‌, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను సాగనంపితేనే భవిష్యత్తు

భామిని, న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి పంపి, కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని పాలకొండ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. భామిని, బొడ్డగూడ, నులకజోడు పంచాయతీల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బొడ్డగూడ సర్పంచి బిడ్డిక మార్తమ్మ, భామిని ఎంపీటీసీ సభ్యురాలు బిడ్డిక తులసీ, మాజీ సర్పంచి పొట్నూరు నాగేశ్వరరావుతో పాటు 135 కుటుంబాల వారు వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి  జయకృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. అయిదేళ్లుగా సాగుతున్న వైకాపా ఆరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు బి.రవినాయుడు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మల నిబ్రం, ప్రధాన కార్యదర్శి ఎం.జగదీశ్వరరావు, భూపతి ఆనందరావు, జనసేన మండల అధ్యక్షుడు రుంకు కిరణ్‌కుమార్‌, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని