logo

ఓటెత్తిన ఉద్యోగులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్‌లు పొందారు.

Updated : 06 May 2024 03:33 IST

తొలి రోజు 48 శాతం

పాలకొండలోని కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, కురుపాం గ్రామీణం, సాలూరు, పాలకొండ, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. నాలుగు నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 6,818 మంది ఉద్యోగులు బ్యాలెట్‌లు పొందారు. ఆదివారం 3,282 మంది (48 శాతం) ఓటును వినియోగించుకున్నారు.

ప్రతి ఎన్నికల్లో అంతా గుంభనంగా జరిగిపోయే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఈసారి అందుకు భిన్నంగా సాగింది. ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు శిబిరాలను ఏర్పాటు చేసి వారి ఓట్లు పొందేందుకు ప్రయత్నించారు. పార్వతీపురంలో అత్యధికంగా 62.7 శాతం మంది ఓటు వినియోగిం చుకోగా కురుపాంలో తక్కువగా 40 శాతం మంది ఓటేశారు. పాలకొండలో 47.2 శాతం, సాలూరులో 42.29 శాతం నమోదయ్యాయి. సోమ, మంగళవారాలు బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. జిల్లాలోని నాలుగు కేంద్రాలను కలెక్టరు నిశాంత్‌కుమార్‌, జేసీ శోభిక, ఆర్వోలు హేమలత, వి.వి.రమణ, విష్ణుచరణ్‌, శుభమ్‌ బన్సల్‌ సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని