logo

జనం ఆస్తులకు జగన్‌ గండం

దేశంలో ఎక్కడా అమలుకాని భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని కూటమి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి ఆరోపించారు.

Published : 08 May 2024 04:59 IST

తెదేపా నాయకులతో కలిసి వినతిపత్రం ఇస్తున్న జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా అమలుకాని భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని కూటమి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి ఆరోపించారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురంలోని తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో గ్రామాల్లోని సన్న, చిన్నకారు రైతుల భూ హక్కులు హరించుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో భూమిపై పెత్తనం అధికారుల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఆమె వెంట తెదేపా మండల కన్వీనర్‌ సుదర్శనరావు, ఎస్టీసెల్‌ కన్వీనర్‌ భూషణరావు, నాయకులు కళావతి, భారతమ్మ, రాజేష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు