logo

రక్తనిధి నిల్వలు పెంచేందుకు చర్యలు

ప్రైవేట్‌ రక్తనిధి బ్యాంక్‌ యజమానులకు తక్షణమే తగు ఆదేశాలు జారీ చేసి రక్తనిధి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో సురేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 23 May 2024 02:23 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రైవేట్‌ రక్తనిధి బ్యాంక్‌ యజమానులకు తక్షణమే తగు ఆదేశాలు జారీ చేసి రక్తనిధి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో సురేష్‌కుమార్‌ తెలిపారు. ‘జిల్లాలో రక్తం లేదు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ప్రస్తుతం ఎన్నికలు, వేసవి కాలం దృష్ట్యా రక్తదానం చేసే దాతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు చెప్పారు. మరోపక్క కళాశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో దాతలు అందుబాటులో లేకపోవడం దీనికి ఓ కారణమన్నారు. ఎన్నికలు ముగిసిన దృష్ట్యా రక్తనిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని