logo
Published : 29/11/2021 04:53 IST

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం

ఖాళీ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

దరఖాస్తుల స్వీకరణ.. త్వరలో ఎంపిక

ఒంగోలు సర్వజన ఆసుపత్రి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే : వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్‌, వైద్య విద్య పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రస్తుతం డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ పరిధిలోని వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది నియామకానికి షెడ్యూల్‌ ప్రకటించారు. వైద్యులు, స్టాఫ్‌నర్సు పోస్టులను రాష్ట్ర స్థాయిలో, మిగిలినవి జిల్లా స్థాయి కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు.

ఎంపిక ప్రక్రియ ఇలా...

జిల్లాలో 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 21, ఎఫ్‌ఎన్‌వో 68, శానిటరీ అటెండెంట్‌ కం స్వీపర్‌ 38 పోస్టుల భర్తీకి వైద్యఆరోగ్య శాఖ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. డిసెంబర్‌ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 15న పరిశీలన, 17న ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా, 18-20 మధ్య అభ్యంతరాల స్వీకరణ, 23న తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు. 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఉత్తర్వులిస్తారు. ల్యాబ్‌ టెక్నీషియన్లకు డిప్లొమా ఇన్‌ మెడికల్‌ టెక్నాలజీ, లేదా ఎంఎల్‌టీ ఒకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అసిస్టెంట్లకు పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఇప్పటికే 225 మంది దరఖాస్తులు సమర్పించారు. మెరిట్‌ కం రోస్టర్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు.

ప్రతి పీహెచ్‌సీలో ప్రసవాలే లక్ష్యంగా...

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇకపై తప్పనిసరిగా ప్రసవాలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.రత్నావళి పేర్కొన్నారు. ఇందుకు 89 స్పెషలిస్టు పోస్టుల నియామకం చేపట్టగా, అర్హులైనవారు రాకపోవడంతో ప్రస్తుతం ఏడు మాత్రమే భర్తీ అయ్యాయన్నారు. ఆర్థో, పీడియాట్రిక్స్‌, గైనకాలజిస్ట్‌లు అందుబాటులో ఉంటారని.. వారంలో 12 పీహెచ్‌సీలను ఎంపిక చేసుకుని వారు సేవలందిస్తారని చెప్పారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్‌, ఒక ఫార్మసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌వో తప్పనిసరిగా ఉంటారని వివరించారు. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నందున వైద్యులు ప్రసవాలను తప్పనిసరిగా చేయాలని సూచించారు.

జీజీహెచ్‌లో 116...

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒంగోలు సర్వజన ఆసుపత్రికి ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌తో పాటు 9 అసోసియేట్‌, 10 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు చేశారు. ఇవి కాకుండా పారామెడికల్‌ కింద మూడు ల్యాబ్‌టెక్నీషియన్‌, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు, స్టాఫ్‌నర్సు, ఫార్మసిస్టు, కార్డియాలజీ టెక్నీషియన్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, క్యాత్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్పీచ్‌ థెరపిస్టు, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌, సీటీ టెక్నీషియన్‌ తదితరాలు కలిపి 116 పోస్టుల నియామకానికి అనుమతిచ్చారు. ఈ పోస్టులను జిల్లా స్థాయి కమిటీ ద్వారా నియామకాలు చేపడతారు.

పీజీ సీట్లు పెరుగుతాయి...

జీజీహెచ్‌కి కొత్తగా కేటాయించే పోస్టులతో అన్ని విభాగాల్లో పీజీ వైద్య సీట్లు పెరుగుతాయి. మొత్తం 11 విభాగాలుండగా ప్రస్తుతం మూడింటిలో 12 సీట్లు మాత్రమే మంజూరయ్యాయి. అదే విధంగా మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. భర్తీకి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో కలెక్టర్‌ ఆమోదంతో ప్రకటన విడుదల చేస్తాం. - డాక్టర్‌ డి.శ్రీరాములు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని