logo
Published : 03/12/2021 05:30 IST

ఏపీలో గాడి తప్పిన పాలన: గఫూర్‌


మహాసభలో ప్రసంగిస్తున్న సీపీఎం నేత గఫూర్‌

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీలో సీఎం జగన్‌ నేతృత్వంలో పరిపాలన సజావుగా సాగడం లేదు.. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తానని.. కుర్చీలో కూర్చున్నాక దాన్ని వదిలేశారు. జగన్‌, చంద్రబాబునాయుడు ఇద్దరూ ప్రధాన మంత్రికి వంతపాడుతురు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ. గఫూర్‌ అన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా సీపీఎం 13వ మహాసభలు స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో స్వర్గీయ సూరా అంకిరెడ్డి నగర్‌లో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న భాజపా సామాన్య ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కార్పొరేట్ల సంపదను రెట్టింపు చేసేందుకు మాత్రమే ప్రధానమంత్రి మోదీ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. నోట్లరద్దు, కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మహాసభల్లో అధ్యక్షవర్గంగా పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హానీఫ్‌, గాలి వెంకటరామిరెడ్డి, ఎం.రమేష్‌, ఊసా రాజ్యలక్ష్మి, వెల్లంపల్లి ఆంజనేయులు వ్యవహరించారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని