logo

నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

 వాడుక నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఆవేదన గురైన ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని రామాయణకండ్రి గ్రామ మహిళలు ఒంగోలు- శ్రీళైలం రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో

Published : 09 Aug 2022 01:43 IST

ఒంగోలు- శ్రీశైలం రహదారిపై బిందెలతో మహిళల నిరసన

పొదిలి గ్రామీణం, న్యూస్‌టుడే:  వాడుక నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఆవేదన గురైన ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని రామాయణకండ్రి గ్రామ మహిళలు ఒంగోలు- శ్రీళైలం రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామంలో 500 మంది జనాభా ఉన్నారు. భూగర్భజలాలు అడుగండటంతో నీటి సమస్య తీవ్రమైంది. రోజు సరఫరా చేస్తున్న మూడు ట్యాంకర్ల సంఖ్యను అధికారులు తగ్గించారు. పది రోజులుగా నీటి సరఫరాను అపివేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు తెలిపిన పట్టించుకోకపోవడంతో మహిళలు ఆగ్రహానికి గురై రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీహరి సంఘటన స్థలం చేరుకొని వారితో మాట్లాడారు. సమస్య అధికారులకు తెలియజేశారు. నీటి సరఫరాశాఖ అధికారులు స్పందించి నీటి ట్యాంకర్లు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని