logo

మనక్‌.. ఎందుకులే అనుకోవద్దు

విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం 2009-10 విద్యాసంవత్సరం నుంచి ఇన్‌స్పైర్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 20 Aug 2023 03:51 IST

భావి శాస్త్రవేత్తలకు తొలి అడుగు
సృజన చాటేందుకు అత్యుత్తమ వేదిక

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం 2009-10 విద్యాసంవత్సరం నుంచి ఇన్‌స్పైర్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆధునికీకరించింది. విద్యార్థులు రూపొందించే సైన్స్‌ ప్రాజెక్టులు కేవలం పోటీకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కారం, స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణం తదితర అంశాలతో ముడిపడి ఉండేలా సైన్స్‌ నమూనాలు రూపొందించేలా రూపొందించారు. వీటివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనేది ఉద్దేశం.

  •  పోటీకి ప్రభుత్వ ఊతం...: ప్రతి జిల్లా నుంచి అందిన దరఖాస్తుల్లో ఎంపిక చేసిన వాటిని జిల్లాస్థాయి ప్రదర్శనకు అనుమతిస్తారు. ఇలా ఎంపికైన విద్యార్థి ప్రాజెక్టు తయారు చేయడానికి ఖర్చుల కింద ప్రభుత్వమే రూ.10 వేలు అందిస్తుంది. జిల్లా స్థాయిలో ఎంపికైన వాటిని రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైతే జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నమూనాగా గుర్తిస్తే రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
  • సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ...: ఉమ్మడి ప్రకాశంలోని సైన్స్‌ ఉపాధ్యాయులకు ప్రాజెక్టుల తయారీపై ఇటీవల శిక్షణ ఇచ్చారు.  డీఈవో సుబ్బారావు హాజరై ప్రాజెక్టులు రూపొందించేలా సైన్స్‌ ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి అయిదు, యూపీ నుంచి మూడు ప్రాజెక్టులకు అవకాశం ఉందని, వీటిని ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరారు.
  •  
  • మార్గదర్శకాలివీ...:

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆరు నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. ఇంటికి సంబంధించిన అంశాలు, రైతులు, కూలీలు, కార్మికులకు సంబంధించిన దైనందిన సమస్యకు సహజ, సృజనాత్మక, వినూత్న పద్ధతిలో పరిష్కారం చూపుతూ పోటీకి నామినేషన్లు పంపించవచ్చు. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా అంశాల ఆధారంగా ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. బాల బాలికల్లో దాగున్న సృజనాత్మకను వెలికి తీయడానికి ఇదో వేదిక.


విద్యార్థికి ఉపయుక్తి.. జిల్లాకు కీర్తి...

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ మనక్‌ ఓ మంచి అవకాశం. విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం.. జిల్లాకు కూడా కీర్తి లభిస్తుంది. చక్కటి ఆవిష్కరణలు రూపొందించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. 2022-23లో ఎంపికైన ప్రాజెక్టులను ప్రదర్శనకు సిద్ధంగా ఉంచుకోవాలి. పోటీల్లో పాల్గొనేవారు బ్యాంకు ఖాతా, తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, పాఠశాల డైస్‌ కోడ్‌, ఈ- మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలను పొందుపర్చాలి. ప్రాజెక్టు వివరాలు క్లుప్తంగా తెలపాలి.

టి.రమేష్‌, జిల్లా సైన్స్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు