logo

ఏరులై పారిన మద్యం

మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్‌ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు.

Published : 23 Apr 2024 04:48 IST

 విచ్చలవిడిగా నగదు పంపిణీ ‌
ర్యాలీతో ఇబ్బందులు

మార్కాపురంలోని కళాశాల రహదారిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు

మార్కాపురం, న్యూస్‌టుడే : మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్‌ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. కొంత మందికి రూ.300 పంపిణీ చేశారు. ఎక్కడిక్కడ మద్యంతో పాటు చికెన్‌తో కూడిన పలావును పంపిణీ చేశారు. మద్యం కోసం పంపిణీ చేసిన చీటీలను తీసుకొని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల వద్దకు  వెళ్లి మరీ మద్యంను తీసుకున్నారు. ర్యాలీలో చిన్నపిల్లలు సైతం జెండాలు చేతపట్టుకోని కనిపించారు.

గుంటూరు, విజయవాడ నుంచి మహిళలు : నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలే కాకుండా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న మహిళ కూలీలను ప్రత్యేకంగా వాహనాల్లో తరలించారు.వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి నగదుతో పాటు రవాణ ఖర్చుతో పాటు భోజన వసతి కల్పించారు. వీరిని స్థానికంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కల్యాణ మండపంలో ఉంచడం వివాదస్పందమైంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాజకీయ ప్రచారానికి తితిదే కల్యాణ మండపం వాడుకోవడం ఏమిటని ప్రతిపక్షాలు వాపోయాయి. మాకు చెప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకురావడమేమిటి మార్కాపురం వచ్చిన మహిళలు వైకాపా నాయకులతో గొడవపడ్డారు.

ట్రాఫిక్‌కు అంతరాయం : మార్కాపురం కళాశాల రహదారితో పాటు దోర్నాల బస్టాండ్‌ మీదుగా గడియారస్తంభం నుంచి మార్కాపురం కంభం కూడలి వరకు వైకాపా నిర్వహించిన ర్యాలీతో ట్రాఫిక్‌కు అంతరాయం  ఏర్పడింది. పోలీసులు ఎటువంటి నిబంధనలు విధించకపోవడంతో అదే రహదారిపై ఒక పక్క ర్యాలీ, మరొక పక్క వాహనాలు, మరొక పక్క సాధారణ ప్రజల రాకపోకలతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వైకాపా నాయకులు, కార్యకర్తల మధ్య సాధారణ ప్రజలు రహదారిపై నిలిచిపోవాల్సి వచ్చినందుకు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని