logo

ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టంచేశారు.

Published : 03 May 2024 03:31 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి పోటీచేయనున్న అభ్యర్థులతో గురువారం స్థానిక ప్రకాశం భవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంక్‌ ఖాతాను ప్రారంభించడంతోపాటు, నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచి ఆ ఖాతా ద్వారానే ఎన్నికల ఖర్చుల వివరాలు చూపాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న ఖర్చులను ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా మూడు దఫాలుగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ ఖర్చులకు సంబంధించిన రిజిష్టర్లు, బ్యాంక్‌ ఖాతా పుస్తకాలతో ఈ నెల 4, 7, 10 తేదీల్లో కలెక్టరేట్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు అరవింద్‌కుమార్‌ చౌరాసియా, మయూర్‌ కె.మెహతా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని