logo

కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.

Published : 03 May 2024 02:58 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు. ముందుగా ఎన్ని కావాలనేది పాఠశాలల హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు పెడతారు. సరఫరా చేసిన తర్వాత సదరు హెచ్‌ఎం ధ్రువీకరణతో ఇన్వాయిస్‌ను ఆన్‌లైన్‌లో పంపుతారు. డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం విభాగం అధికారి, కింది స్థాయి సిబ్బంది వీటిని క్రోడీకరించి గుత్తేదారుకు బిల్లు చెల్లిస్తారు. విద్యాశాఖ కార్యాలయంలో ఈ బాధ్యతను ఒక సహాయ సంచాలకుడికి అప్పగించారు. వేసవి సెలవులకు ముందు ఏప్రిల్‌లో రెండు విడతలే గుడ్లు సరఫరా చేశారు. అయినప్పటికీ విద్యాశాఖ కార్యాలయంలో మాత్రం రెండు లక్షల గుడ్లకు అదనంగా రూ.10 లక్షలు బిల్లులిచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని