logo

చోరీ కేసు నిందితుడి విషాదాంతం

చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 23 Apr 2024 04:51 IST

 మనస్తాపంలో బలవన్మరణానికి పాల్పడిన వైనం 

మహేష్‌బాబు  (పాత చిత్రం)

న్యూస్‌టుడే, సంతనూతలపాడు : చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కలకలం రేపిన ఏటీఎం నగదు చోరీ కేసులో ఏ-1 ఉన్న సన్నమూరి మహేష్‌బాబు(22) సోమవారం ఉరి వేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..ఈ నెల 18న ఒంగోలు - కర్నూల్‌ రోడ్డులోని ఇండియన్‌ పెట్రోలు బంకు వద్ద సీఎంఎస్‌ వాహనంలోని రూ.66 లక్షల నగదు చోరీకి గురైంది. దీనికి సంబంధించి కామేపల్లివారిపాలేనికి చెందిన సన్నమూరి మహేష్‌బాబును ఏ 1 నిందితుడిగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై ఇంటికి పంపించివేశారు. అప్పటి నుంచి అతను దిగాలుగా ఉన్నాడు. ఆదివారం రాత్రి మహేష్‌బాబు టీవీ చూసి ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయాడు. సోమవారం ఉదయం తలుపు గడియ వేసి ఉండటంతో అనుమానమొచ్చి తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు సోమకుమార్‌ పక్కనున్న కిటికీ లోంచి లోపల గడియను తీసి ఇంట్లోకి వెళ్లారు. లోపల ఉరి వేసుకుని ఉన్న మహేష్‌ను గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్సై దేవకుమార్‌ అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో మహేష్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఎంఎస్‌ మేనేజర్‌ కొండారెడ్డి ప్రమేయంతోనే చోరీ చేశానని, మరో నిందితుడి రాచర్ల రాజశేఖర్‌కు ఎలాంటి సంబంధం లేదని అందులో రాసినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని