logo

జన బలం జాతర..

జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది.

Published : 23 Apr 2024 05:18 IST

'

దర్శి: తెదేపా కూటమి అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా గడియార స్తంభం కూడలిలో జన సందోహం

జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. అధికార పార్టీ వైకాపా, ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా అభ్యర్థులు నామపత్రాలను అట్టహాసంగా అధికారులకు అందించారు. ఒకే రోజు చేపట్టిన ఈ కార్యక్రమాలను పరిశీలిస్తే.. జిల్లాలో రెండు పార్టీల పరిస్థితి ఏమిటో తెలుస్తోంది. తెదేపా అభ్యర్థుల ప్రదర్శనకు జనాలు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు, యువతీ యువకులు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థులు మాత్రం నానాపాట్లు పడ్డారు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి జనాన్ని సమీకరించాల్సి వచ్చింది. అరువు జనాలు వెంటరాగా అదే బల ప్రదర్శనగా ఊరేగారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ జనాలు లేక వెలవెలబోయింది. 

- న్యూస్‌టుడే, దర్శి- కొండపి గ్రామీణం

వినేవారూ లేక వెల వెల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని