logo

‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం

‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు.

Published : 30 Apr 2024 03:42 IST

మాట్లాడుతున్న తెదేపా కొండపి అభ్యర్థి స్వామి.. వేదికపై నేతలు స్వామి, తెలుగు మహిళలు జ్యోత్స్న, సునీత తదితరులు

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. మహిళా భేరి కార్యక్రమాన్ని కొండపిలో సోమవారం నిర్వహించారు. స్వామి, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్య, తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య, నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో మోసపు మాటలు చెప్పిన జగన్‌.. అధికారం చేపట్టిన వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, బస్సు ఛార్జీలు పెంచలేదన్నారు. వైకాపా గెలిచిన తర్వాత నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను మహిళలని చూడకుండా జగన్‌ వేధింపులకు గురిచేశారని విమర్శించారు. ఎస్మాను ప్రయోగించి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను తరిమికొట్టడానికి మహిళలు ఇప్పటికే కంకణం కట్టుకున్నారన్నారు. తెదేపా కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల ఆర్థిక శక్తిని మరింత పెంచుతాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళా భేరిలో తెదేపా ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కోడలు చందనా రెడ్డి, మహిళా నేతలు శశికళ, రజితా రెడ్డి, క్షత్రియ, రాష్ట్ర తెలుగు మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాయపాటి సీతమ్మ, డ్వాక్రా సంఘం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు నాగేంద్రం, భాజపా నాయకురాలు గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని