logo

పన్ను పెంపు.. బాదుడే బాదుడు

ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది.

Published : 02 May 2024 02:06 IST

యజమానులపై అదనంగా వడ్డింపు
ఇబ్బందులు పెడుతున్న సర్కార్‌
గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే

ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. ఏటా 15శాతం మేర పన్ను పెంపు చేసి ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలకు అది భారంగా మారింది.

పన్నులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి  ముక్కుపిండి పన్నులు వసూలు చేపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో ఇంటి విస్తీర్ణం ఆదారంగా   గతంలో ఇంటి విస్తీర్ణం, నిర్మాణం తీరు, సొంతగా వినియోగించుకుంటున్నారా లేక అద్దెకు ఇచ్చారా అని క్షేత్రస్థాయిలో పురపాలక సిబ్బంది పరిశీలించి పన్ను వేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ఆస్తి విలువ ఆధారంగా ముదింపు చేసి ఇంటి పన్ను వేసే ప్రక్రియను అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ప్రాంతాల వారీగా ఆస్తి విలువను బట్టి ప్రతి ఏడాది ఇంటి పన్ను 15శాతం పెంపుదల చేస్తున్నారు.  గిద్దలూరు నగర పంచాయతీలో పలువురు ఇంటి యజమానులకు గత ఏడాది చెల్లించిన పన్నుకంటే అధనంగా 100 రెట్లకు పైగా  పన్ను డిమాండ్‌ రావడంతో ఇంటి యజమానులు డిమాండ్‌ నోటీసులు చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.


ఎందుకు పెంచారో చెప్పటం లేదు

గిద్దలూరు నగర పంచాయతీ ఏబీఏంపాలెంలో కింద షాపులు, పైన గృహ నిర్మాణం చేపట్టా. గత ఏడాది ఇంటి పన్ను డిమాండ్‌ రూ.6,958 రావడంతో ప్రారంభంలోనే 5 శాతం రిబెట్‌ ఉండటంతో పన్ను రూ.6,610 చెల్లించాను. అయితే ఈ ఏడాది అదే ఇంటికి రూ.15,302 పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీస్‌ అందజేశారు. ఈ ఏడాది 15శాతం పెరిగింది.  ఎందుకు పెరిగిందని నగర పంచాయతీ అధికారుల వద్దకు వెళ్లినప్పటికీ తమకు సంబంధం లేదని ఆన్‌లైన్‌లో పెరిగిందని, మీ ప్రాంతంలో ఆస్తివిలువు పెరిగి ఉండవచ్చునని తెలియజేశారు.

చిక్కుడి చిన్నవేమయ్య, ఉపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు