logo

పోలైన తపాలా ఓట్లు 16,400

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది.

Published : 08 May 2024 04:28 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో మొత్తం 19,013 మంది ఓటు హక్కు నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. అందులో మంగళవారం సాయంత్రానికి 16,400 మంది తమ హక్కు వినియోగించుకోగా.. మరో 2,613 మంది ఇంకా ఓటు వేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు