logo

రౌడీషీటర్ల బైండోవర్‌

ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది.

Published : 22 May 2024 04:51 IST

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది. శ్రీకాకుళం నగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో 36 మంది, రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో 40 మందిని బైండోవర్‌ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున పెచ్చుమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా బైండోవర్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు ఎక్కడా అవాంఛనీయ  ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని