Andhra News: ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (CM Jagan) శ్రీకాకుళం పర్యటనలో ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది.

Updated : 27 Jun 2022 13:40 IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (CM Jagan) శ్రీకాకుళం పర్యటనలో ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ప్రొటోకాల్‌ జాబితాలో తన పేరు లేదంటూ కేంద్ర మాజీ మంత్రి, వైకాపా నేత కిల్లి కృపారాణి (Killi Krupa Rani) అలిగారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రోటోకాల్‌ జాబితాలో పేరు లేకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. ఇదేమైనా న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు. ‘నా పేరే మర్చిపోయారా..’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌.. ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా శాంతించలేదు. చివరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ (Dharmana Krishna Das) స్వయంగా కృపారాణి కారు దగ్గరకు వెళ్లి బతిమిలాడారు. అయినా ఆమె శాంతించక.. అక్కడ నుంచి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని