logo

చెట్టు ఒకటే... తలలు నాలుగు

తాటిచెట్లను ఎక్కడ చూసినా ఒకే మొదలు నుంచి కాండం ఉండి చివర కొమ్మలు ఉండటం సాధారణం. కాని జలుమూరు మండలంలోని సుబ్రహ్మణ్యపురం సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న ఓ తాటిచెట్టు మొదలుభాగం పైన నాలుగు చెట్లుగా విడిపోయింది. కొత్తగా గ్రామానికి వచ్చేవారు దీన్ని తిలకించి ఆశ్చర్యపోతున్నారు.

Published : 28 Jun 2022 06:44 IST

-న్యూస్‌టుడే, జలుమూరు

తాటిచెట్లను ఎక్కడ చూసినా ఒకే మొదలు నుంచి కాండం ఉండి చివర కొమ్మలు ఉండటం సాధారణం. కాని జలుమూరు మండలంలోని సుబ్రహ్మణ్యపురం సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న ఓ తాటిచెట్టు మొదలుభాగం పైన నాలుగు చెట్లుగా విడిపోయింది. కొత్తగా గ్రామానికి వచ్చేవారు దీన్ని తిలకించి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా విత్తనంలో ఉత్పరివర్తనం వల్ల, జీన్సులో మార్పుల వల్ల ఇలాంటి మొక్కలు పుడతాయని తాటిచెట్లలో ఇలాంటివి చాలా అరుదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని