logo

మందులు ఉన్నా మాయరోగం

అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేద రోగులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు కొందరి నిర్లక్ష్యం వల్ల ఇలా చెత్తకుప్పలోకి చేరుతున్నాయి. టెక్కలిలోని సచివాలయం-2 వద్ద రోగులకు అందించాల్సిన మందుల్ని బ్లీచింగ్‌ బస్తాల పక్కన నిర్లక్ష్యంగా పడేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Published : 03 Oct 2022 02:50 IST

టెక్కలి సచివాలయంలో చెత్తకుప్పలో ఔషధాలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేద రోగులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు కొందరి నిర్లక్ష్యం వల్ల ఇలా చెత్తకుప్పలోకి చేరుతున్నాయి. టెక్కలిలోని సచివాలయం-2 వద్ద రోగులకు అందించాల్సిన మందుల్ని బ్లీచింగ్‌ బస్తాల పక్కన నిర్లక్ష్యంగా పడేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జ్వరాలు, కీళ్లనొప్పులు, అలెర్జీలు ఇతర సమస్యలకు ప్రభుత్వం అందించిన మాత్రలు, సిరప్‌లకు మరో ఏడాది గడువున్నా సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా పడేశారు. ఈవిషయాన్ని కె.కొత్తూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి లక్ష్మీప్రసన్న దృష్టికితీసుకెళ్లగా అక్కడి ఏఎన్‌ఎం గోనె సంచిలో ఉంచిన మందుల్ని సిబ్బంది ఎవరో చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయారని, ఇలాంటివి పునరావృతంకాకుండా చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని