logo

అంగన్‌వాడీల్లో మందుల్లేవ్‌..!

ప్రథమ చికిత్సకు ఉపయోగించే పెట్టెలు అంగన్‌వాడీ కేంద్రాల్లో లేకపోవడంతో అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 27 Mar 2024 03:37 IST

కేంద్రాల్లో కానరాని ప్రథమ చికిత్స కిట్లు
న్యూస్‌టుడే, బలగ (శ్రీకాకుళం)

ప్రథమ చికిత్సకు ఉపయోగించే పెట్టెలు అంగన్‌వాడీ కేంద్రాల్లో లేకపోవడంతో అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఏడాది కిందట సరఫరా చేసిన కిట్లు కొన్నిచోట్ల కాలం చెల్లిపోవడంతో కార్యకర్తలు బయట పడేశారు. ప్రస్తుతం ప్రథమ చికిత్స పెట్టెలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. కిట్లలో పారాసెటమాల్‌ మందు, మాత్రలు, ఆల్బెండజోల్‌, కడుపు నొప్పి మందు, దూది, స్పిరిట్‌, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాల నివారణకు మందులు ఉండేవి. కొన్ని సందర్భాల్లో  కార్యకర్తలే చిన్నారులకు సమకూర్చుతున్నారు.  


విజృంభిస్తున్న జ్వరాలు

గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సమయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో  ప్రథమ చికిత్స పెట్టెలు అవసరం ఉంది. 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,358  అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు 1,4920, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 44,375 మంది,  మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలు 37,859  మంది ఉన్నారని అధికారులు  చెబుతున్నారు.


రెగ్యులర్‌ పీడీ లేకపోవడంతో..  

సీడీఎస్‌కు రెగ్యులర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ లేరు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పని తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించాలని కోరుతున్నారు. తమ శాఖ నుంచి వచ్చిన వారికి  అవగాహన ఉంటుందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు.


పంపిస్తామని చెబుతున్నారు..

- కె.కల్యాణి, అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు

అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రథమ చికిత్స పెట్టెలు రావడం లేదు. గతేడాది చివరిలో కొద్దిగా పంపిణీ చేశారు. అందులోనూ మూడు నుంచి నాలుగు రకాలు మాత్రమే  ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పిల్లలకు సమస్యలొస్తే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులను సంప్రదిస్తే  పంపిస్తామని చెబుతున్నారు. తొందరగా అందజేస్తే మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని