logo

అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!

టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 25 Apr 2024 04:29 IST

మేమంతా సిద్ధం సభకు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

శ్రీకాకుళంలో బస్సు వెనుక పరుగు తీస్తూ..

టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖ నుంచి 360, విజయనగరం 115, శ్రీకాకుళం నుంచి 190 బస్సులను అధికారులు సభకు కేటాయించారు. దీంతో శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో అరకొరగా ఉన్న బస్సుల కోసం ప్రయాణికులు గంటల
తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. వేరే దారిలేక ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పలువురు వాపోయారు.  - న్యూస్‌టుడే, అరసవల్లి, ఆమదాలవలస గ్రామీణం, కొత్తూరు, పలాస, మందస, నరసన్నపేట

పలాసలో పల్లెవెలుగుకే ఎక్స్‌ప్రెస్‌గా బోర్డు మార్చిన వైనం

ప్రజలతో ఆడుకుంటున్నారు

ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల అవసరాలు పట్టడం లేదు. ఎన్నికల వేళ తన ప్రచార సభలకు జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులు వినియోగించడం సరికాదు. బస్సులు లేక ఎండలో ప్రయాణికులు పడిన బాధలు వర్ణనాతీతం. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు. నియంతలా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.

ఎం.విక్రం, భిన్నల, మందస మండలం

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తూ..

ఎండలో వేచి చూడాల్సి వచ్చింది

ఆమదాలవలస నుంచి మా గ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేక పోవడంతో ఎండలో వేచి చూసి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. బస్సులు సీఎం సభకు వేశారని చెబుతున్నారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ నుంచి వైఎస్సార్‌ కూడలి వరకు నడుచుకొని వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి ఆటోలో వెళ్లాల్సి వచ్చింది.

నారాయణమ్మ, సింగన్నపాలేం, ఆమదాలవలస మండలం

ఒక్క బస్సు లేదు

ఆమదాలవలస నుంచి మా గ్రామానికి బస్సులు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నాం. వేరే దారిలేక ఆటోలకు అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణం చేయాల్సి వచ్చింది.  నాయకుల సమావేశాలకు బస్సులు వేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. కనీసం దాని గురించి పట్టించుకోక పోవడం బాధాకరం. 

ఆదెయ్య, బూర్జ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని