logo

బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.

Published : 04 May 2024 05:45 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, పెయింటింగ్‌, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు తదితర అంశాల్లో ప్రతిభ చూపుతున్న బాలలు జూలై 31లోగా ్చ‌్ర్చ౯్ట(.్ణ్న‌్ర.i- వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి న్యూదిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేస్తారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని