logo

ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి తెలిపారు. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌లు, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు.

Published : 04 May 2024 05:52 IST

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి, చిత్రంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి తెలిపారు. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌లు, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్‌ విద్యార్థి మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీసు పరిశీలకులు దిగంబర్‌ పి.ప్రదాన్‌ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టు విధానాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు వివరించారు. రూ.4 కోట్ల వరకు నగదు సీజ్‌ చేశామన్నారు. బీఎల్‌వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రాధిక, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఏఎస్పీ ప్రేమకాజల్‌, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని