logo

పరిశోధన విభాగం బలోపేతానికి చర్యలు

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో అకడమిక్‌ అంశాలతో పాటు పరిశోధన విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.ఆర్‌.రజని అన్నారు.

Published : 04 May 2024 05:46 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో అకడమిక్‌ అంశాలతో పాటు పరిశోధన విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.ఆర్‌.రజని అన్నారు. పరిశోధన జర్నల్స్‌పై కమిటీ సభ్యులతో తన ఛాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధన విభాగంలో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వర్సిటీలో నూతనంగా ‘ఏ మల్టీ డిసిప్లినరీ ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ’ అనే జర్నల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. దీంట్లో ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, న్యాయశాస్త్రం తదితర రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన పరిశోధన పత్రాలను స్వీకరించి ప్రతి మూడు నెలలకు ఈ జర్నల్‌ను వర్సిటీ అధికారికంగా ప్రచురించనుందన్నారు. వర్సిటీలో ప్రత్యేక ‘రీసెర్చ్‌ ఫోరం’ ఏర్పాటు చేసి, ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రీసెర్చ్‌ జర్నల్‌ సభ్యులు డా.ఎన్‌.సంతోష్‌ రంగనాథ్‌, డా.జి.ఎల్‌.వి.ప్రసాదరావు, డా.జి.రామకృష్ణ, డా.కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని