logo

ఎండప్రచండం

జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు.

Published : 26 Apr 2024 03:59 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు నీడనిచ్చేందుకు షేడ్‌ నెట్లు ఏర్పాటు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని