Crime News: కోరిక తీర్చలేదని బావ ఘాతుకం.. బిడ్డ సహా మరదలి దారుణహత్య
తన లైంగిక కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను బిడ్డతోపాటు దారుణంగా నరికి చంపాడో కసాయి. హృదయ విదారకమైన ఈ ఘటన దిండిగల్లులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దిండిగల్లు జిల్లా పెరియమలైయూర్ వలసైకి చెందిన శివకుమార్, అంజలై(22)
విల్లివాక్కం(తమిళనాడు), న్యూస్‌టుడే: తన లైంగిక కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను బిడ్డతోపాటు దారుణంగా నరికి చంపాడో కసాయి. హృదయ విదారకమైన ఈ ఘటన దిండిగల్లులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దిండిగల్లు జిల్లా పెరియమలైయూర్ వలసైకి చెందిన శివకుమార్, అంజలై(22) రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె మలర్విళి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మేకలను మేపడానికి బిడ్డతో అడవికి వెళ్లిన అంజలై తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు, బంధువులు వెళ్లి వెతికారు. తల్లి, బిడ్డ కాలిన స్థితిలో విగత జీవులుగా కనిపించారు. నత్తం పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ అన్న కరుప్పయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. అతడిని అరెస్టు చేశారు. అంజలైని తన కోరిక తీర్చాలని పలుమార్లు అడిగినా అంగీకరించలేదని, ఓ సారి వేట కొడవలితో నరకాలని యత్నిస్తే తప్పించుకుందని నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తర్వాత వేరు కాపురం పెట్టడంతో తనకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు చెప్పాడన్నారు. ఈ నేపథ్యంలో శనివారం మేకలను మేపడానికి అడవికి వెళ్లినపుడు కూడా తన కోరిక తీర్చమని అడిగితే అంగీకరించలేదని, దీంతో వేట కొడవలితో నరికానని, తర్వాత బిడ్డను కూడా నరికి మృతదేహాలకు నిప్పంటించినట్లు తెలిపాడని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్