logo

‘సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ’

నగరంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహద పడుతాయని నార్త్‌జోన్‌ ఐజీ ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా పేర్కొన్నారు. కాంచీపురం శివకంచి పోలీసు స్టేషను పరిధిలో పల్లవర్‌ మేడులో నేరాల అదుపునకు ఏర్పాటు చేసిన పోలీసు అవుట్‌ స్టేషను, సీసీ కెమెరా వ్యవస్థను శనివారం ప్రారంభించారు

Published : 22 May 2022 04:43 IST

పోలీసు అవుట్‌ పోస్టును ప్రారంభిస్తున్న ఐ.జీ ఆనంద్‌ సిన్హా,

చిత్రంలో డీఐజీ ఎం.సత్యప్రియ, ఎస్పీ సుధాకర్‌ తదితరులు

కాంచీపురం, న్యూస్‌టుడే: నగరంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహద పడుతాయని నార్త్‌జోన్‌ ఐజీ ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా పేర్కొన్నారు. కాంచీపురం శివకంచి పోలీసు స్టేషను పరిధిలో పల్లవర్‌ మేడులో నేరాల అదుపునకు ఏర్పాటు చేసిన పోలీసు అవుట్‌ స్టేషను, సీసీ కెమెరా వ్యవస్థను శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నేడు అనేక ప్రాంతాల్లో చోరీలు, దోపీడీలు, హత్యలు జరుగుతున్నాయని, నేరాల అదుపునకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా కాంచీపురం నగరంలో అవసరమైన చోట్ల పోలీసు అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఐజీ సత్యప్రియ మాట్లాడుతూ.. నేడు నగరంలో మహిళల వద్ద చైను స్నాచింగ్‌లు అధికమయ్యాయని, అందుకే పల్లవర్‌ మేడులో పోలీసు అవుట్‌ పోస్టును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరిధిలో మహిళలు ఏవైనా సమస్యలు ఏర్పడినా, నేరాలు జరిగినా వెంటనే 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.ఎం.సుధాకర్‌, కాంచీపురం డీఎస్పీ జూలియస్‌ సీజర్‌, శివకంచి ఎస్సై జే.వినాయకం సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని