logo

దంతవైద్య కళాశాలలో త్వరలో ప్రవేశాలు

పుదుకోట్టైలో నిర్మాణంలో ఉన్న కొత్త దంతవైద్య కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు జరగనున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై ప్యారీస్‌లోని దంతవైద్య కళాశాల ఆస్పత్రిలో దంతవైద్య ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

Published : 18 Aug 2022 00:44 IST

ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పుదుకోట్టైలో నిర్మాణంలో ఉన్న కొత్త దంతవైద్య కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు జరగనున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై ప్యారీస్‌లోని దంతవైద్య కళాశాల ఆస్పత్రిలో దంతవైద్య ప్రదర్శన, రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాష్ట్రంలో దంతవైద్య కళాశాలలో, చిదంబరం అన్నామలై దంత వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులు చేరారని చెప్పారు. వచ్చే ఏడాది మూడో దంతవైద్య కళాశాల పుదుకోట్టైలో ఏర్పడనుందన్నారు. నిర్మాణ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. వచ్చే ఏడాదిలో 50 మంది విద్యార్థులు చేరేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మదురై ఎయిమ్స్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేందుకు, రాష్ట్రంలో ఆరు వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు  అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి కోరామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంచార దంతవైద్య వాహనం ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 4,308 వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది తిరుచ్చిలో కొత్తగా నర్సింగ్‌ కళాశాల ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని