logo

ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లకు ముగిసిన తర్ఫీదు

తమిళనాడు, పుదుచ్చేరి జోన్లకు నూతనంగా నియమితులైన సీజీఎస్టీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లకు 14 వారాల ‘ఇండక్షన్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం’ (ప్రేరణ శిక్షణ కార్యక్రమం) జరిగింది.  జూన్‌ 20వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వరకు జరిగిన

Published : 25 Sep 2022 01:35 IST

కార్యక్రమంలో పాల్గొన్న బృందంతో అధికారులు

వడపళని, న్యూస్‌టుడే: తమిళనాడు, పుదుచ్చేరి జోన్లకు నూతనంగా నియమితులైన సీజీఎస్టీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లకు 14 వారాల ‘ఇండక్షన్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం’ (ప్రేరణ శిక్షణ కార్యక్రమం) జరిగింది.  జూన్‌ 20వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వరకు జరిగిన శిక్షణలో 58 మంది పాల్గొన్నారని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌’ (ఎన్‌ఏసీఐఎన్‌) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం (22న) పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌, శుక్రవారం వీడ్కోలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సీజీఎస్టీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌ తమిళనాడు, పుదుచ్చేరి విభాగ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చెన్నై ‘ఎన్‌ఏసీఐఎన్‌’ ప్రిన్సిపల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఆర్‌ ఉదయభాస్కర్‌ వ్యాఖ్యతగా పాల్గొన్నారు. అత్యుత్తమంగా శిక్షణ పొందిన ముగ్గురుని పతకాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని