logo

కాంగ్రెస్‌కు కలిసిరానున్న అవకాశం: తిరుమా

రాహుల్‌గాంధీ ఎంపీ పదవిపై అనర్హతవేటు వేసి కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని మోదీ మంచి అవకాశాన్ని కల్పించారని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 02:04 IST

ఆందోళనలో పాల్గొన్న తిరుమావళవన్‌, ముత్తరసన్‌ తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ ఎంపీ పదవిపై అనర్హతవేటు వేసి కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని మోదీ మంచి అవకాశాన్ని కల్పించారని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ వీసీకే తరఫున ‘ప్రజాస్వామ్య పరిరక్షణ న్యాయ పోరాటం’ పేరుతో బుధవారం సాయంత్రం చెన్నై వళ్లువర్‌కోట్టంలో ఆందోళన చేపట్టారు. ఇందులో తిరుమావళవన్‌ మాట్లాడుతూ... ఈ విషయంలో రాహుల్‌ గాంధీకి ఏం నష్టం లేదన్నారు. ఆయన చాలా స్పష్టంగా, ధైర్యంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మిగతా అన్ని పార్టీలను ఏకం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనిని మోదీ, రాహుల్‌ మధ్య గొడవగా చూడకూడదని, ఇది భావజాల పోరుగా అభివర్ణించారు. నేడు ప్రారంభమైన ఆందోళన 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని