logo

దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్‌

దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్‌ బుధవారం చెన్నై టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.

Published : 28 Mar 2024 00:17 IST

పీఎంకే మేనిఫెస్టో విడుదల

మేనిఫెస్టో విడుదల చేస్తున్న రామదాస్‌, అన్బుమణి రామదాస్‌ తదితరులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్‌ బుధవారం చెన్నై టీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌, మాజీ కేంద్రమంత్రి ఏకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో.. రిజర్వేషన్‌లో క్రిమిలేయర్‌ తొలగింపు, దేశం మొత్తం కులాలవారీగా జనగణన చేపట్టడం, అన్ని కులాలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం, కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన వ్యక్తుల సంక్షేమశాఖ ఏర్పాటు తదితర పలు అంశాలు ఉన్నాయి. తమిళనాడులో రాష్ట్ర స్వయంప్రతిపత్తి, నీటి నిర్వహణ, యువజన సంక్షేమం, యువత ఉపాధి, మహిళా సంక్షేమం, విదేశీ తమిళుల సంక్షేమం వంటి వివిధ హామీలు కూడా పేర్కొన్నారు. అన్బుమణి రామదాస్‌ మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకేలలో మార్పు రావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. ఈ కారణంగానే భాజపాతో కూటమి పెట్టుకున్నామని చెప్పారు. తదుపరి ఎన్నికలపై ఇప్పుడే చెప్పలేమన్నారు. భాజపా కూటమిలో ఉంటూనే నీట్‌ను బలంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ప్రధాని వద్ద నీట్‌ వ్యవహారాన్ని వివరించి పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నికల ప్రచార వివరాలు రెండ్రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు.

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని