logo

పోలీసుశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌

తమిళనాడు పోలీసుశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయమై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తారు.

Published : 06 May 2024 01:34 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తమిళనాడు పోలీసుశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయమై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తారు. నిందితులు, అదృశ్యమైన వారు, అనుమానితుల డేటాను ఎఫ్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో రాష్ట్ర పోలీసులు పోస్టు చేస్తారు. ఇది ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌. ఓ వ్యక్తి ఫొటో పోలీస్‌స్టేషన్‌లలో సీసీడీఎన్‌ఎస్‌లో పోస్టుచేసిన డేటాతో పోల్చి గుర్తించేందుకు ఉపయోగిస్తారు. దీనిని ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా పోలీసులు సెల్‌ఫోన్‌లలో ఉపయోగిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ నిందితులను గుర్తించేందుకు సాయపడుతుంది. ఆదివారం ఈ వెబ్‌సైట్‌ని హ్యాకర్లు బ్లాక్‌ చేశారు. ఈ విషయమై సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని