logo

Vizag: ఇదే చివరి ప్రయత్నమా?

విశాఖ ఆర్‌కే   బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ సవాల్‌గా మారింది. పూర్తిస్థాయిలో సన్నద్ధత పరిశీలనకు  అధికారులు తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది.

Updated : 08 Mar 2024 08:24 IST

దెబ్బతిన్న ‘ఫ్లోటింగ్‌ బ్రిడ్జి’ డబ్బాల మార్పు
అమరికలో మార్పులపై దృష్టి

ఈనాడు, విశాఖపట్నం : విశాఖ ఆర్‌కే   బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ సవాల్‌గా మారింది. పూర్తిస్థాయిలో సన్నద్ధత పరిశీలనకు  అధికారులు తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది. ఎలాగైనా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా దానిపై పట్టు చిక్కడం లేదు. అలల తాకిడికి  ఎలా తట్టుకుంటుందనే పరిశీలన ప్రక్రియలోనే కొంతవరకు పాడైంది. ‘వ్యూపాయింట్‌’ డబ్బాలు బాగా దెబ్బతిన్నాయి. మళ్లీ అనుసంధానం చేసి నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోవడంతో దెబ్బతిన్న వాటిని పూర్తిగా మార్చే ప్రక్రియ గురువారం చేపట్టారు.

ఈసారి అలలను తట్టుకునే సామర్థ్యం కలిగినవి, కొంచెం బరువున్న వాటిని తీసుకొచ్చినట్లు తెలిసింది. కొన్నింటిని సాగరం లోపల ఉన్న వ్యూపాయింట్‌కు జత చేశారు. సముద్రం లోపలే దాన్ని అలా ఉంచారు. బీచ్‌లో ఉన్న వంతెనను విడదీసి పాడైన వాటిని మార్చారు. అలల తీవ్రత తట్టుకునేలా అమరికలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. బ్రిడ్జి అంతా సిద్ధమయ్యాక పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇందుకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టొచ్చని సమాచారం. ఇదే చివరి ప్రయత్నంగా అన్ని రకాలుగా సన్నద్ధం కావటానికి యత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని