logo

అటల్‌ కమ్యూనిటీ ఉత్సవాలు

సబ్బవరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో అటల్‌ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్‌ ఇన్‌ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.

Published : 20 Apr 2024 03:14 IST

సబ్బవరం, నూన్యస్‌టుడే: సబ్బవరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో అటల్‌ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్‌ ఇన్‌ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్‌ సీహెచ్‌వీ సత్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈవో బీఎస్‌ఎన్‌ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు గురుకులాల విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించారు. సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌, కేజీ బీవీల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ చిరంజీవి, ఉపాధ్యాయులు జానకిరామ్‌, ప్రభాకర్‌, తిరుపతిరావు, మోహన్‌రావు, తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని