logo

ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు

నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి.

Published : 26 Apr 2024 03:26 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పలువురు అభ్యర్థులు 81 సెట్లు సమర్పించారు. భీమిలిలో ఆరుగురు, తూర్పు 12, దక్షిణం 10, పశ్చిమం 10, ఉత్తరం 9, గాజువాక 10, పెందుర్తిలో ఆరుగురు దాఖలు చేశారు. ఈనెల 18న ప్రారంభమైన నామపత్రాల స్వీకరణ గురువారంతో ముగిసింది. శుక్రవారం వాటిని నియోజకవర్గ ఆర్‌ఓ కార్యాలయాల్లో పరిశీలించనున్నారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. ః విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ   నియోజకవర్గాలకు మొత్తం 147 మంది 247 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. గురువారం ఒక్క రోజే భారీగా నామినేషన్లు వేయడం గమనార్హం. గడువు ముగిసే సమయానికి భీమిలి నియోజకవర్గానికి 20 మంది, తూర్పునకు 23, దక్షిణంలో 20, ఉత్తరంలో 25, పశ్చిమంలో 18, గాజువాకలో 21, పెందుర్తిలో 20 మంది నామపత్రాలు అందించారు.


ముగ్గురు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తుల బదిలీ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: విశాఖలోని ముగ్గురు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. విశాఖ మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు విజయనగరం స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి జి. కార్తీక్‌ వస్తున్నారు. విశాఖ ఐదో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి యు.మాధురి శ్రీకాకుళం జిల్లా పలాస జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో చిత్తూరు జిల్లా పుంగనూరు ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి గుర్రం సింధు వస్తున్నారు. గాజువాక జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వై.ప్రేమలత విజయనగరం జిల్లా చీపురుపల్లి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అనకాపల్లి ప్రధాన జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి పి.ప్రదీప వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని