logo

కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం

ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు ధ్వజమెత్తారు.

Published : 27 Apr 2024 04:08 IST

గుల్లేపల్లిలో మాట్లాడుతున్న పంచకర్ల రమేశ్‌బాబు పక్కన గండి బాబ్జీ తదితరులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం సబ్బవరం మండలంలో మొగలిపురం, మల్లునాయుడుపాలెం, గుల్లేపల్లి, బోదువలస ఎల్లుప్పి తదితర గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగన్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. భూమి, ఇసుక, ఖనిజాలు వంటి సహజ వనరులను అయిదేళ్లలో ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 3 గ్యాస్‌ సిలిండర్లు, 15-50 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నారు. అదే విధంగా కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా వారందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తారని పేర్కొన్నారు. తన గుర్తు గాజు గ్లాసుకు, సీఎం రమేశ్‌ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.

పెందుర్తి తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఆస్తులను 13 లక్షల కోట్లకు తాకట్టు పెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లుతుందన్నారు. విశాఖపట్నంలో రూ.25 వేల కోట్లకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని ఆరోపించారు. సబ్బవరం మండలం మొగలిపురంలోని ఓ చెరువు గర్బాన్ని ప్లాట్లు వేయడానికి మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పినగాడి ప్రజలతో కలసి ప్రయత్నించారన్నారు. దీనిపై స్టే తీసుకురావడం జరిగిందన్నారు. అది మొగలిపురానికి చెందిన రైతులకు చెందే విధంగా కృషి చేయాలని పంచకర్లను కోరారు. కార్యక్రమంలో బి.సాయినాథరావు, గండి దేముడు, గొర్లె రామునాయుడు, జి.రవి, పలువురు కార్యకర్తలు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని