logo

విశాఖ లోక్‌సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం

విశాఖ లోక్‌సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ), కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆమోదించారు.

Published : 27 Apr 2024 04:20 IST

ఆరు తిరస్కరణ

నామపత్రాల పరిశీలనలో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున, చిత్రంలో కేంద్ర పరిశీలకులు అమిత్‌మిశ్ర, రాజీవ్‌కుమార్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ), కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరింటిని తిరస్కరించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామపత్రాల పరిశీలన కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులు అమిత్‌మిశ్ర, అమిత్‌కుమార్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు కార్యక్రమానికి హాజరయ్యారు. అఫిడవిట్‌లో సంతకం చేయని కారణంగా మహబూబ్‌ సుభాన్‌ (స్వతంత్ర) నామపత్రాన్ని తిరస్కరించారు. ఫార్మాట్‌ ప్రకారం దరఖాస్తు సమర్పించనందున వియ్యపు గంగరాజు (స్వతంత్ర), నక్క నమ్మిగ్రేస్‌ (జై భీమ్‌ భారత్‌ పార్టీ) నామపత్రాలను తిరస్కరించినట్లు ప్రకటించారు. తెదేపా, వైకాపా అభ్యర్థులకు ప్రత్యామ్నాయం(డమ్మి)గా మతుకుమిల్లి తేజస్విని, బొత్స అనూష దాఖలు చేసిన నామపత్రాలను తిరస్కరించారు.  

స్వతంత్ర అభ్యర్థి పట్టపగలు రాజా రమేష్‌ పత్రాల్లో బలపర్చిన సంతకాలన్నీ ఒకే విధంగా ఉండడంతో ఆర్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేసి వివరణ కోరారు. వివరణపై సంతృప్తి చెందని ఆర్‌ఓ సంతకాల ధ్రువీకరణపై విచారణ చేపట్టి తదుపరి తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని