logo

పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు

కొరాపుట్‌-రాయగడ సెక్షన్‌లో భద్రతాపరమైన  పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Published : 29 Apr 2024 04:06 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: కొరాపుట్‌-రాయగడ సెక్షన్‌లో భద్రతాపరమైన  పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

 ఈ నెల 29, మే 3, 6 తేదీల్లో విశాఖ-కొరాపుట్‌(18512), ఈ నెల 30, మే 4, 7 తేదీల్లో కొరాపుట్‌-విశాఖ(18511) బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌  రైళ్లను రద్దు చేశారు. ఏప్రిల్‌ 28 నుంచి మే 8 వరకు విశాఖ-కొరాపుట్‌(08546), ఏప్రిల్‌ 28 నుంచి మే 9 వరకు కొరాపుట్‌-విశాఖ(08545) రైళ్లు రాయగడ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో రాయగడ నుంచి బయలుదేరుతాయి.

  ఈ నెల 28న ఉదయం 10.15 గంటలకు బయలు దేరాల్సిన ఎస్‌ఎంవీ బెంగళూర్‌-జాషిది (22305) ఎక్స్‌ప్రెస్‌ 29న ఉదయం 6.45 గంటలకు బయలు దేరేలా మార్పు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు